పెండ్లంటే.. ఎకోఫ్రెండ్లీనే!


Tue,September 17, 2019 12:43 AM

ecofriendly
పెండ్లంటూ చేసుకుంటే పదితరాల వరకు చెప్పుకునేలా అంగరంగ వైభవంగా చేసుకోవాలి అనుకునేవారు. ఇప్పుడలా కాదు. పెండ్లంటూ చేసుకుంటే ఎకోఫ్రెండ్లీ పెండ్లినే చేసుకోవాలని ఈ దంపతులు పట్టుబట్టి కూర్చున్నారు. వీరిని చూసి మరో పదిమంది మారితే చాలనుకుంటున్నారు.


బెంగళూరుకు చెందిన జయశ్రీ అరుణ్‌కుమార్‌, అభినవ్‌ బార్గుర్‌ ఏడాది క్రితం పెండ్లి ఖాయమైంది. వీరు కూడా అందరిలా ఘనంగా, అంగరంగ వైభవంగా జరిపించాలనుకున్నారు. కానీ, అందులో ప్లాస్టిక్‌ వాడకం ఉండకూడదు. కరెక్ట్‌గా చెప్పాలంటే ఎకోఫ్రెండ్లీ పెండ్లి చేసుకోవాలని నిర్ణయించున్నారు. ఇద్దరి తరుపున పెద్దలు ఒప్పుకున్నారు. జయశ్రీ మామయ్య ‘గ్రీన్‌ ఉత్సవ్‌' సంస్థ్థ ఫౌండర్‌ రిషితా శర్మతో మాట్లాడాడు. ఈ పెండ్లితో వాతావరణానికి ఎలాంటి ముప్పు వాటిల్లకూడదు. రీసైకిల్‌ చేసిన కాగితంతో ఆహ్వాన పత్రికను తయారు చేశారు. సంగీత్‌, పూజ, పెండ్లికి పంక్తి భోజనంలో వాడే ప్లాస్టిక్‌ గ్లాసులు, విస్తరాకులకు బదులుగా స్టీల్‌ గ్లాస్‌, అరిటాకులలో భోజనం వడ్డించారు. అరిటాకులను కంపోస్ట్‌ చేయడానికి ఉపయోగించారు. మండపానికి ప్లాస్టిక్‌ను నిర్మూలించి రంగురంగుల పూలు, తోరణాలతో అలంకరించడంతో అందరూ అద్భుతంగా ఉందంటూ మాట్లాడుకోసాగారు. మండపం అంతా శుభ్రంగా ఉంచుతున్నారు. వివాహానికి విచ్చేసిన 3,000 మందికి కొబ్బరికాయలను బహుమతిగా ఇచ్చి మర్యాదలు తగ్గకుండా చూసుకున్నారు. గ్రీన్‌ ఉత్సవ్‌ ఇప్పటివరకు ఎకోఫ్రెండ్లీ ఈవెంట్లు, పార్టీలు చేశారు. ఎకోఫ్రెండ్లీ వివాహం ఇదే మొదటిసారి అంటున్నారు రిషితా శర్మ. శ్రీజయ, అభినవ్‌ల పెండ్లి ఆదర్శంగా నిలుస్తున్నది.

369
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles