అలసటగా అనిపిస్తున్నదా?


Tue,September 17, 2019 12:44 AM

woman
తలనొప్పి, కడుపులో వికారంగా ఉండడం, కండరాల నొప్పులు, మూడీగా ఉండడం, ఆకలి మందగించడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం ఏకాగ్రత లోపించడం వంటివి అలసిపోతున్నట్లు తెలిపే చిహ్నాలు. వీటిని అధిగమించాలంటే..


- ప్రస్తుతం కంప్యూటర్‌ లేనిదే ఏ పనీ జరగడం లేదు. కాబట్టి కంప్యూటర్‌ ముందు కూర్చొని పనిచేయడం, టీవీ చూడడం వంటివి కాస్త తగ్గించుకోవాలి. దీర్ఘకాలికంగా డిప్రెషన్‌, యాైంగ్జెటీ కలిగిస్తున్న కారణాలు జీవితంలో ఏమున్నాయో గుర్తించాలి. ఆ తర్వాత వాటితో రాజీపడడమో లేక కౌన్సెలింగ్‌ సాయమో తీసుకోవాలి.
- జీవితాన్ని హాయిగా ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నించండి. రోజూ కనీసం 10 నిమిషాలైనా నడవండి. శరీరానికి సరైన ఆహారం, వ్యాయామం, మనసుకు తగినంత ప్రశాంతత ఉంటే నీరసం, నిస్సత్తువ మీ దరికి చేరదు.
- శరీరంలో నీరు లేకపోయినా నిస్సత్తువ ఆవహిస్తుంది. కాబట్టి నీరు ఎక్కువగా తాగాలి. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఆహారం, తృణ ధాన్యాలతో కూడిన ఆహారాన్ని ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవాలి. అతిగా డైటింగ్‌ చేయడం వల్ల కూడా శరీరంలోని శక్తి హరించుకుపోతుంది. దీంతో నీరసం ఆవహిస్తుంది.
- ఒకేసారి ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం కంటే కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది. మహిళలు తీసుకునే ఆహారంలో ఐరన్‌ మోతాదు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. తగినంత నిద్రపోవాలి.
- నిద్ర పట్టకపోతే ఎట్టిపరిస్థితుల్లో మాత్రలు వాడొద్దు. ప్రతిరోజు వ్యాయామం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. శరీరానికి శ్రమ కలిగేట్లుగా ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం వల్ల కూడా అలసట కలిగి తగినంత నిద్ర లభిస్తుంది.

6680
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles