శూన్యంలోంచి.. అందమైన జీవితంలోకి..


Tue,September 17, 2019 12:44 AM

Upma-Kapoor
పన్నెండేండ్ల వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమె జీవితంలో శూన్యం అలుముకుంది. నిశ్శబ్దంగా సాగుతున్న ఆమె జీవితంలో ఉన్నత చదువు ఆమె దిశను మార్చింది. చదువు అయిపోయిన వెంటనే ఆర్థిక సాయం తీసుకొని ‘బ్యూటీ’ బిజినెస్‌లోకి చేరింది ఢిల్లీకి చెందిన ఉపమా కపూర్‌.


తెలిసీ తెలియని ప్రాయంలోను ఉపమా కపూర్‌ తల్లిదండ్రులకు దూరమయ్యారు. ఈ విషాదం తర్వాత ఆమె జీవితంలో మిగిలిన వెలితిని ఎవరూ భర్తీ చేయలేదు. తల్లిదండ్రులు అందించే ప్రేమ, ప్రోత్సాహం అవేమీ ఆమెకు తెలియదు. బంధువుల సాయంతోనే ఫినాన్స్‌లో ఎంబీఏ చేసింది. 15 ఏండ్లపాటు కార్పొరేట్‌ రంగంలో పని చేసింది. తర్వాత శరీర సౌందర్య లేపనాల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఈ మార్పు అంత సులభంగా జరగలేదు. ఆమె తల్లిదండ్రులు ఎప్పుడూ ఆమె గురించి గొప్పగా చెప్పేవారనీ, వారుంటే ఈ విజయం ఎప్పుడో సాధించేదాన్ని అని ఆమె చెప్తుంది. స్నేహితుల, బంధువుల, బ్యాంకుల సాయంతో ఏడు లక్షల పెట్టుబడితో ‘టీల్‌-టెర్ర’ అనే బ్యూటీ బిజినెస్‌ స్థాపించింది. రసాయనాలు లేకుండా ఉండే సౌందర్య ఉత్పత్తులను తయారు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. 18 మంది మహిళా కార్మికులకు ఉపాధి కల్పించి ఆమె కంపెనీనీ అభివృద్ధి చేసింది. రెండేండ్ల కాలంలోనే 2 కోట్లకు పైగా ఆదాయాన్ని పొందింది. ఈ వ్యాపారంలోకి మహిళలను తీసుకోవడం అనేది ఆమె ముందే అనుకున్న నిర్ణయం అనీ, ఎందుకంటే వారికి డబ్బులు సంపాదించే మార్గాన్ని చూపించడానికి అని ఉపమా చెప్తుంది. ప్రస్తుతం ఆ మహిళలు 7వేల నుంచి 15 వేల వరకూ సంపాదిస్తున్నారు. మార్కెటింగ్‌, డెలివరీ విభాగంలో మహిళా కార్మికులు కీలకంగా పని చేస్తున్నారని ఉపమా చెబుతున్నది.

544
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles