వాకింగ్ వండర్స్


Tue,September 17, 2019 12:47 AM

బరువు పెరగకుండా, నాజూగ్గా ఉండడానికే కాదు.. రకరకాల అనారోగ్యాల నుంచి తప్పించుకోవడానికి కూడా వ్యాయామం ముఖ్యమైన మార్గం. వ్యాయామంలో అత్యంత సులువైనది నడక. చిన్న పిల్లల దగ్గరి నుంచి వృద్ధుల దాకా ఎక్కువ కష్టం లేకుండా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అలాంటి నడక కలిగించే లాభాలెన్నో..
Fitness-Walking
ప్రతిరోజూ కొంతసేపు నడిస్తే ఆరోగ్యానికి ఢోకా ఉండదని సూచిస్తుంటారు నిపుణులు. మానసిక ఉల్లాసానికే కాకుండా శారీరక ఆరోగ్యానికి కూడా వాకింగ్ చేసే మేలు ఇంతా అంతా కాదు. శరీరంలోని ప్రతి అవయవమూ వాకింగ్ వల్ల పునరుత్తేజం చెందుతుందని అనేక పరిశోధనలు రుజువు చేశాయి. సో.. రోజూ నడవండి.. ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి.. అంటున్నారు నిపుణులు.


పక్షవాతానికి చెక్

శారీరక వ్యాయామాల్లో నడక అంత సులువైనది మరొకటి లేదని చెప్పవచ్చు. కేలరీల ఖర్చేగానీ డబ్బు ఖర్చు ఏమాత్రమూ ఉండదు. జిమ్ కి వెళ్లక్కర్లేదు. వ్యాయామ సామగ్రి అక్కర్లేదు. శిక్షణ అంతకంటే అవసరం లేదు. రోజూ నడవడం వల్ల గుండె నుంచి ఎముకల దాకా ఆరోగ్యం చేకూరుతుంది. వారంలో ఎన్ని ఎక్కువ రోజులు 30 నుంచి 60 నిమిషాల పాటు నడిస్తే గుండె ఆరోగ్యం అంత బాగుంటుంది. నడవడం వల్ల గుండె జబ్బుల అవకాశం గణనీయంగా తగ్గుతుందని అనేక పరిశోధనల్లో రుజువైంది. అంతేగాక వారంలో కేవలం రెండు గంటల పాటు నడిచినా పక్షవాతం వచ్చే అవకాశం 30 శాతం వరకు తగ్గించవచ్చంటున్నారు పరిశోధకులు. వారం మొత్తంలో నాలుగు గంటలు నడిస్తే తుంటి ఎముక ఫ్రాక్చర్ల అవకాశాన్ని 43 శాతం తగ్గించవచ్చని చెప్తున్నారు.

డిప్రెషన్ దూరం

ప్రతిరోజూ ఒక గంట సమయం నడిస్తే స్థూలకాయం వచ్చే అవకాశం సగానికి పడిపోతుంది. 3,500 అడుగుల నడక మధుమేహ అవకాశాన్ని 29 శాతం తగ్గిస్తుంది. అంటే దానివల్ల వచ్చే ఆరోగ్య సమస్యలన్నీ తగ్గినట్టే. వారంలో 75 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ చేస్తే మీ జీవిత కాలంలో మరో రెండేళ్లు అదనంగా కలుపవచ్చు. అంటే రెండేళ్ల ఆయుష్షు పెరుగుతుందన్నమాట. ఇకపోతే నడక వల్ల మానసిక ఆరోగ్యం కూడా బావుంటుంది. వారానికి మూడుసార్లు 40 నిమిషాల పాటు నడిస్తే మెదడులో జ్ఞాపకశక్తి కేంద్రాలు ఉత్తేజితం అవుతాయి. ఆలోచనా పరిధి పెరుగుతుంది. డిప్రెషన్ లక్షణాలను వాకింగ్ ద్వారా 36 శాతం తగ్గించవచ్చని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇక మూడ్ బాలేదనుకున్నప్పుడల్లా సరదాగా పార్కులో నలభై అడుగులు వేయండి.

176
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles