ఆడవాళ్లే అదుర్స్!


Sun,September 22, 2019 01:01 AM

జ్ఞాపకాల అంశం మీద తరుచూ అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, ఇటీవల స్త్రీ, పురుషులు గుర్తుంచుకునే జ్ఞాపకాల మీద ఓ సర్వే జరిగింది. ఆ సర్వే ఆసక్తికరమైన విషయాలను చెప్తున్నది.
women
సాధారణంగా పురుషులు కొన్ని కొన్ని విషయాలను, వస్తువులను అప్పుడప్పుడూ మర్చిపోతుంటారు. సరిగ్గా ఇలాంటి అంశం మీదనే స్వీడన్‌లోని కరోలిన్సికా ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ గ్రూప్ ఓ అధ్యయనం చేసింది. పురుషులు, స్త్రీలు గుర్తుంచుకునే అంశాల మీద సర్వే చేసింది. మూడేండ్లు చేసిన ఈ సర్వే ఫలితాలను ఈ మధ్య విడుదల చేసింది. ఈ ఫలితాల ఆధారంగా తెలిసిందేంటంటే.. ఆడవాళ్లలో ఎపిసోడిక్ మెమరీ ఎక్కువ అని తేలింది. ఎసిసోడిక్ మెమరీ అంటే సుమారు వారం రోజుల క్రితం ఎలాంటి పనులు, సంభాషణలు చేశారు? ఎలాంటి మందులు తీసుకున్నారు.. అనే విషయాలను గుర్తుంచుకోవడంలో ఇది ఉపయోగపడుతుంది. ఈ ఎపిసోడిక్ మెమరీ ద్వారా స్త్రీలకు ప్రయోజనం ఉంటుంది. ఎలాంటి పదార్థాలను, ఎలాంటి విషయాలను గుర్తుంచుకోవాలో వాటి కోసం ఈ ఎపిసోడిక్ మెమరీ సాయం చేస్తుంది. ముఖాలు గుర్తుంచుకోవడం, సినిమాలు, పాఠాలు, పాటలు, వస్తువులను, వాటిని పెట్టిన స్థలాలను గుర్తుంచుకోవడంలో ఆడవాళ్లే ముందున్నారు. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్లి వచ్చిన మార్గాన్ని, నైరూప్య చిత్రాలను గుర్తుంచుకోవడంలో పురుషులు ఆసక్తి చూపుతారని ఈ అధ్యయనం తెలిపింది.

174
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles