రోగనిరోధక శక్తి పెంచుకోండిలా..


Sun,September 22, 2019 01:12 AM

Immunity-power-women
-ఆయుర్వేదం ప్రకారం తేనెలో అద్భుతమైన ఔషద గుణాలున్నాయి. వ్యాధులను తగ్గించే గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. శరీరంలోని సూక్ష్మ క్రిములను నాశనం చేసే శక్తి తేనెకు ఉంటుంది. అందుకని ఇది సహజసిద్ధమైన యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. నిత్యం తేనెను ఆహారంలో భాగం చేసుకుంటే మన శరీరంలో ఉండే క్రిములు నశిస్తాయి. ఇన్‌ఫెక్షన్లు త్వరగా నయమవుతాయి.
-వెల్లుల్లి కూడా సహజసిద్ధమైన యాంటీ బయాటిక్‌లా పనిచేస్తుంది. ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతుంది. వెల్లుల్లిలో ఉండే ఆల్లిసిన్ అనే సమ్మేళనం శరీరంలో ఉండే హానికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. వెల్లుల్లి రెబ్బలు రెండింటిని నిత్యం రెండు పూటలా నేరుగా తిన్నా లేదా వాటిని నూనెలో రోస్ట్ చేసుకొని తిన్నా ఫలితం ఉంటుంది.
-అల్లంలో సహజసిద్ధమైన యాంటీ బయాటిక్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలుంటాయి. అల్లంలో ఉండే జింజెరాల్ అనబడే సమ్మేళనం అనేక ఔషధ గునాలను కలిగి ఉంటుంది. ఇది వికారాన్ని తగ్గిస్తుంది. కండరాల నొప్పులను పోగొడుతుంది. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. వ్యాధులు త్వరగా నయం అయ్యేలా చేస్తుంది.
-పసుపులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో ఉండే కర్‌క్యుమిన్ అనబడే పదార్థం సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది.

383
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles