ఈ బామ్మ ఇడ్లీ ఉచితం


Sun,September 22, 2019 01:13 AM

వీళ్లంతా నా కస్టమర్లు అంటే నేను నమ్మను. నా దగ్గరకు వచ్చే వాళ్లంనంతా ఓ కుటుంబం లాగా భావిస్తాను. వాళ్ల దగ్గర డబ్బులు లేకపోయినా సరే వారి ఆకలి తీర్చడమే నాకు సంతోషం
bamma
తమిళనాడుకు చెందిన డెబ్బయేండ్ల రాణి మాటలివి. మొఖంలో చిరునవ్వు, ఎదుటి వాళ్ల ఆకలి తీర్చాలన్న ఆకాంక్షతో ఆమె జీవనం సాగిస్తున్నది. తమిళనాడులోని రామేశ్వరంలో పేదవాళ్లకు, యాత్రికులకు ఉచిత ఇడ్లీలను అందిస్తూ అందరి మనన్నలూ పొందుతున్నది. సొంత ఇల్లు లేకపోయినా రామేశ్వరం అగ్నితీర్థ సముద్ర తీరంలో తాత్కాలిక దుకాణాన్ని ఏర్పాటు చేసుకుంది. చెక్క పొయ్యి, సంప్రదాయ పద్దతుల్లో ఇడ్లీని తయారు చేస్తున్నది. సాధారణంగా హోటలల్లో 60 రూపాయలకు దొరికే ఇడ్లీని పేదవారికి రాణి ఉచితంగా అందిస్తుంది. అక్కడికి వచ్చిన యాత్రికుల నుంచి ఎంతో కొంత డబ్బులు తీసుకుంటుంది. ఆమె హృదయాన్ని అర్థం చేసుకున్న యాత్రికులెవరైనా ఆమెకు సాయంగా, విరాళం రూపంలో డబ్బులు ఇస్తుంటారు. నిజానికి నా దగ్గర డబ్బులేదు. కానీ నా దగ్గరకు ప్రజలు ఎప్పుడూ వస్తూ ప్రేమను చూపిస్తారు. అందుకే నేను రోజూ ఇడ్లీలు తయారు చేసి వారికి ఇస్తాను అని బామ్మ అంటున్నది. వాళ్లను ఎప్పుడూ కస్టమర్లుగా భావించలేదనీ, కుటుంబం అనుకుంటున్నానని అంటున్నది. ఇలా రామేశ్వరం స్థానికంగా రాణికి ఆధారణ పెరిగింది. మీరెప్పుడైనా రామేశ్వరం వెళ్తే అగ్నితీర్థ లోని రాణి ఇడ్లీ దుకానాణాకి వెళ్లి రండి..

629
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles