వాట్సాప్ అప్‌డేట్..


Wed,September 25, 2019 12:27 AM

ఫేస్‌బుక్ సొంత యాప్ వాట్సాప్ రెండు యాప్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూనే ఉంది. ఇటీవలే వాట్సాప్‌లో ఎన్నో ఫీచర్లు చేరినా తాజాగా మరో ఫీచర్ చేరింది.
wtsup
ఇప్పుడు వాట్సాప్‌లో స్టేటస్ అప్‌డేట్ చేయడం తెలియని వారు ఉండరు. అట్లాగే ఫేస్‌బుక్‌లో స్టోరీ అప్‌డేట్ కూడా అచ్చం ఇలాంటిదే. కానీ రెండింటినీ వేర్వేరుగా అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ముందు ఏదైనా ఒకదాంట్లో అప్‌డేట్ చేశాక, కావాలనుకుంటే ఇంకో దాంట్లో ఆప్‌డేట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అప్‌డేట్ అయిన ఫీచర్‌తో ఒకే క్లిక్‌తో వాట్సాప్ స్టేటస్‌నే ఫేస్‌బుక్ స్టోరీగా అప్‌డేట్ చేసుకోవచ్చు. అప్‌డేట్ చేసిన స్టేటస్ మీద నొక్కితే షేర్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని ద్వారా ఈ స్టేటస్‌ను ఫేస్‌బుక్ స్టోరీగా మార్చవచ్చు. ఇప్పటి వరకూ వాట్సాప్ స్టేటస్‌ను వేరే యాప్‌లోకి షేర్ చేసుకొనే వీలున్నా ఇప్పుడు ఫేస్‌బుక్ స్టోరీలోకి షేర్ చేసుకొనే ఫీచర్ కావడంతో ఆసక్తికరంగా మారింది.

321
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles