‘అలెక్సా’ మరింత స్మార్ట్‌


Wed,October 2, 2019 01:03 AM

alexa
అమెజాన్‌ నుంచి వచ్చిన అలెక్సా ఎకో స్మార్ట్‌ మార్కెట్‌లో ఎలా సంచలనం సృష్టించిందో టెక్నాలజీ ఫాలోవర్లకు తెలిసింది. దానికి కొనసాగింపుగా అమెజాన్‌ మరో ప్రొడక్ట్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది


వాయిస్‌ కమాండ్స్‌తో పని చేసే అలెక్సా ఇప్పుడు మరింత స్మార్ట్‌ అయింది. అమెజాన్‌ నుంచి దీని కోసం ప్రత్యేకంగా ఇయర్‌ బర్డ్స్‌ విడుదలయ్యాయి. వాయిస్‌ కమాండ్స్‌ ఇవ్వడానికి ఇయర్‌ బర్డ్స్‌ ఎందుకనే సందేహం మీకు రావొచ్చు. ట్రాఫిక్‌, పబ్లిక్‌లో, రణగొనధ్వనుల మధ్య ఉన్నప్పుడు వాయిస్‌ కమాండ్‌ను అలెక్సా సరిగ్గా స్వీకరించదు. అలాంటప్పుడు నాయిస్‌ క్యాన్సలేషన్‌తో వాయిస్‌ను తీసుకోవడం కోసం ఈ ఇయర్‌ బర్స్‌ ఉపయోగపడతాయి. ఇంటర్నెట్‌లో కావాల్సిన సమాచారాన్ని వెతకడానికి దీని ద్వారా కమాండ్స్‌ ఇవ్వొచ్చు. కమాండ్లను స్వీకరించిన ఇయర్‌ బర్డ్స్‌ .. ఇంటర్నెట్‌లో దాన్ని వెతికి మళ్లీ మనకు వినిపిస్తుంది. పాటలు, వార్తలు, జోకులు ఇలా అంశం ఏదైనా వెతికి పెట్టడంలో అలెక్సా సహాయపడుతుంది.

229
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles