ఈ సమస్యకు కారణమేంటి?


Thu,October 10, 2019 01:28 AM

నా వయసు 19 సంవత్సరాలు. గత కొంతకాలంగా నా ముఖంపై మొటిమలు, అవాంఛిత రోమాలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖం జిడ్డుగా కూడా ఉంటున్నది. దీనికి తోడు బరువు కూడా పెరుగుతున్నది. మెడ భాగంలో చర్మం నల్లరంగులోకి మారుతున్నది. నా సమస్యకు పరిష్కారం తెలుపగలరు.
- నిఖిల, వరంగల్

pcos-cysts
మీరు తెలిపిన వివరాల ప్రకారం మీకు పీసీఓడీ (పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) సమస్య ఉన్నట్టు అనిపిస్తున్నది. ఇది ఎక్కువగా యుక్తవయసు వారిలో కనబడుతుంది. మీ కుటుంబంలో ఎవరికైనా మధుమేహ వ్యాధి ఉండి, అధిక బరువుతో బాధపడి ఉంటే అవి వంశపారంపర్యంగా మీకు వచ్చే అవకాశం ఉంది. రోగ నిర్ధారణకు టెస్టోస్టిరాన్ హార్మోన్ లెవల్, పెల్విక్ అల్ట్రాసౌండ్ పరీక్షలతో పాటు బ్లడ్ షుగర్, థైరాయిడ్ స్థాయిలను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. మీ సమస్యలకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే మందులు వాడడంతో పాటు రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజ్‌లు, డైట్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. మీకు అవాంఛిత రోమాలు మరీ ఎక్కువగా ఉన్నట్టయితే దాన్ని లేజర్ చికిత్స ద్వారా పరిష్కరించవచ్చు. ముందు మీరు మీ దగ్గరలోని ఎండోక్రైనాలజిస్టును కలవండి.
dr-s-reddy

7584
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles