తక్కువ ఖర్చుతో వ్యవసాయం


Thu,October 10, 2019 01:32 AM

చిన్నప్పుడు తాతయ్యతో కలిసి పొలం దగ్గరకు వెళ్లేది. అతను వ్యవసాయం చేసే విధానాన్ని దగ్గరుండి గమనించేది. అప్పుడప్పుడూ పొలం పనులూ చేసేది. పళ్లై, పిల్లలు పుట్టినా.. పల్లెటూరిని వదిలేసి నగర జీవితాన్ని అనుభవిస్తున్నా.. ఈమెకు వ్యవసాయంపై మక్కువ తగ్గలేదు. ఆ ఇష్టమే ఆమెను తక్కువ ఖర్చుతో కాయగూరలు పండించే విధానంవైపు నడిపించింది.
Avanee-Jain
గుజరాత్‌లోని వడోదరకు చెందిన అవనిజైన్‌కు వ్యవసాయమంటే చాలా ఇష్టం. ఒక పంటను పండించి.. దానిని మార్కెట్ చేయడానికి రైతులు పడే కష్టాన్ని ఆమె కళ్లారా చూసింది. విపరీతంగా పురుగుమందులు, రసాయనాలు వాడి నష్టపోతున్న రైతన్నల వ్యథలనూ విన్నది. ఆ విష రసాయనాల ఆహరం తిని.. అనారోగ్యం పాలవుతున్న ఎంతోమందిని దగ్గరగా చూసింది. అందుకే అతితక్కువ ఖర్చుతో ఆరోగ్యకరమైన, సేంద్రియ పద్ధతిలో పండించే కాయగూరలను ప్రజలకు అందించాలని సంకల్పించింది. మట్టి అవసరం లేకుండా కొబ్బరి పీచు, సేంద్రియ ఎరువులతో కూడిన ఓ కుండీని రూపొందించింది. తన ఉపాజ్ కంపెనీ ద్వారా కొబ్బరి పీచు కుండీ, కాయగూరల విత్తనాలు, సేంద్రియ ఎరువులతో కూడిన కిట్‌ను రూ.299లకు విక్రయిస్తున్నది. ఈ ఉపాజ్ సంస్థ ద్వారా నగరవాసులు ఇంట్లోనే ఆరోగ్యకరమైన కాయగూరలు పండించే విధానంపై అవగాహనా తరగతులు నిర్వహిస్తున్నది అవని. తన పిల్లలకు వ్యవసాయంపై ఆసక్తిని పెంచడానికి ఇంటి పెరట్లోనే వారితో కూరగాయలు పండిస్తున్నది. అలాగే తన ఉపాజ్ సంస్థ ద్వారా పదిమందికి ఉపాధిని కల్పిస్తున్నది. తక్కువ ఖర్చుతో వ్యవసాయం అనే అంశంపై ఎన్నో వర్క్‌షాపులు నిర్వహించింది కూడా.

1020
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles