సీతాఫలం.. ఎంతోబలం


Thu,October 10, 2019 01:32 AM

వర్షాకాలం చివర్లో, చలికాలం ప్రారంభంలో సీతాఫలాలు ఎక్కువగా కాస్తాయి. అధిక ప్రొటీన్లు ఉన్న ఈ పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు. పండు మాత్రమే కాదు చెట్టు వేరు, గింజలు, ఆకులు అన్నీ ఆరోగ్యానికి మంచి చేసేవే.
custard-apple
-సీతాఫలం ఆకుల రసం తాగితే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే చెట్టు వేరుతో పళ్లు తోముకుంటే దంత సమస్యలు తొలిగిపోతాయి. దీంట్లోని పీచు పదార్థం అజీర్తిని తగ్గిస్తుంది. ఈ పండులో పొటాషియం, కార్బోహైడ్రేట్లు రక్తప్రసరణ బాగా జరిగేట్లు చూస్తాయి.
-సీతాఫలంలోని మెగ్నీషియం కండర వ్యవస్థను బలపరుస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సీజన్‌లో రోజుకో సీతాఫలం తింటే అనేక వ్యాధుల్ని దూరం చేసుకోవచ్చు. వందగ్రాముల సీతాఫలంలో వందక్యాలరీలుంటాయి.
-సీతాఫలం గుండె, ఎముక, చర్మ సంరక్షణకు తోడ్పడుతుంది. ఇందులోని మెగ్నీషియం, గుండెనొప్పి, పక్షవాతం వంటివి రాకుండా కాపాడుతుంది. బలహీన గుండె, రక్తప్రసార లోపం, ఒత్తిడి, కండరాల బలహీనత, అధిక బీపీతో బాధపడేవాళ్లకు ఇది ఎంతో మంచిది.
-సీతాఫలం కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. డిప్రెషన్‌కు మందులా కూడా పనిచేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తినేవారికి కీళ్లనొప్పులు వచ్చే అవకాశం తక్కువ. ఇది కడుపులో మంటను తగ్గిస్తుంది. చిగుళ్ల వ్యాధుల్ని నివారిస్తుంది. దీంట్లోని పీచు పదార్థం కొలెస్ట్రాల్ తగ్గేందుకు, రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని నియంత్రించేందుకు సాయపడుతుంది.

1627
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles