మానసిక సౌందర్యమే అందం


Thu,October 10, 2019 01:33 AM

చాలామంది అందానికి ప్రాధాన్యం ఇస్తూ వేలకు వేలు ఖర్చు చేస్తారు. అయితే కంటికి కనిపించే శారీరక సౌందర్యం మాత్రమే కాదు. మేలైన గుణగణాలు, వ్యక్తిత్వం కలిగి ఉంటేనే మనిషికి అసలైన అందం. ఈ మానసిక సౌందర్యం వయసుతో పాటు పెరుగుతూ ఉంటుంది. అయితే మానసిక సౌందర్యం అలవడాలంటే ఈ చిట్కాలు పాటిస్తే చాలు.
beauty
-దాపరికం లేకుండా మాట్లాడాలి. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పాలి. పెదాల మీద చిరునవ్వును ఎప్పుడూ చెరగనీయకూడదు. అందరితో స్నేహంగా ఉండాలి. డిజైనింగ్ దుస్తులు వాడలేకపోయినా శుభ్రంగా ఉన్న దుస్తులు ధరించాలి.
-మాట్లాడే వ్యక్తి కళ్లలోకి సూటిగా చూడడం అలవాటు చేసుకోవాలి. ఎదుటివారు చెప్పేదాన్ని పూర్తిగా విన్న తర్వాత మనోభావాల్ని వ్యక్తీకరించాలి. ఒకరితో మాట్లాడుతున్నప్పుడు మరొకరిని పొగడకూడదు, నిందించకూడదు.
-మాటల్లో వ్యక్తం కాని విషయాలను సున్నితమైన బాడీ లాంగ్వేజ్ ద్వారా చెప్పాలి. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరిపట్లా గౌరవమర్యాదలు ప్రదర్శించాలి. పని విషయంలో క్రమశిక్షణ పాటించాలి. అవసరమైనప్పుడు మృదుబాషణతో ఎదుటి వారి స్పందనను అంచనా వేసి దాన్ని బట్టి మనసులోని భావాలను వెల్లడించాలి.
-అవతలి వారు మనతో మాట్లాడడం ఓ ఆనందకర విషయంగా పరిగణించాలి. ఉన్నంతలో పోషక ఆహారం తీసుకుంటూ రోజూ వ్యాయామం చేయాలి. అబద్ధాలు చెప్పకూడదు. ఎదుటివారిని నొప్పిస్తూ మాట్లాడకూడదు.
-ఉన్నంతలో హుందాగా కనిపించే బట్టలు ధరించాలి. ఒకరి విషయాల్ని మరొకరి దగ్గర ప్రస్తావిస్తే ఎదుటివారికి మనపై నమ్మకం పోతుంది. నిజాయితీగా ఉండడం వల్ల ఎదుటివారిని ఆకర్షించవచ్చు.

585
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles