అన్నం తిన్నాక, తినడానికి ముందు..


Thu,October 17, 2019 12:21 AM

ఆహారం తీసుకున్న తర్వాత కొన్ని పనులు చేయకూదని పెద్దలు అంటుంటారు. కొందరు తిన్న తర్వాత నడవాలని అంటే ఇంకొందరు వద్దంటారు. అన్నం తిన్న తర్వాత, తినకముందు ఏమేం చేయాలంటే..
Eating-woman
-అన్నం తిన్న రెండు గంటల తర్వాతే పండ్లు తినాలి. ఆహారం తీసుకునే గంట ముందు పండ్లను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఇలా చేయడం వల్ల పండ్లలోని పోషకాలు శరీరానికి అందుతాయి. ఆహారం తీసుకున్న వెంటనే నిద్రిస్తే తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి. భోజనానికి, నిద్రకు మధ్య కనీసం గంట సమయం ఉండాలి.
-ఆహారం తీసుకునే అరగంట ముందు టీ తాగకూడదు. ఆహారం తీసుకున్న గంట వరకు టీ తాగకూడదు. తేయాకులోని యాసిడ్స్ జీర్ణ సమస్యలను కలుగజేస్తాయి. ముఖ్యంగా టీ, కాఫీ తాగే ప్రతిసారీ అరగ్లాసుడు నీళ్లను తాగాలి. ఇలా చేయడం వల్ల కెఫిన్ ప్రభావం ఎక్కువగా పడకుండా ఉంటుంది.
-ఆహారం తీసుకున్న తర్వాత ఒక సిగరేట్ తాగితే 10 సిగరెట్లు తాగినంత ప్రమాదం. అన్నం తిన్న తర్వాత ధూమపానం చేసేవారికి మామూలు వారితో పోలిస్తే క్యాన్సర్ కణాలు ఎక్కువ విడుదలయ్యే అవకాశం ఉంటుంది.
-ఆహారం తీసుకున్న తర్వాత బెల్ట్‌ను లూజ్ చేయవద్దు. ఇలా చేయడం వల్ల ఆహారం పేగుల్లోకి సత్వరంగా చేరుకొని జీర్ణసమస్యలను ఏర్పడేలా చేస్తుంది. తిన్న వెంటనే నడువకూడదు. అలా చేయడం వల్ల ఆహారంలోని ధాతువులు, విటమిన్స్ ఆరోగ్యానికి సక్రమంగా లభించవు.

1659
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles