పశ్చాత్తాపంతోనే మన:శాంతి


Sun,October 20, 2019 12:51 AM

Dharma-Sandeham
‘తప్పులు చేసిన వాళ్లుకూడా దేవుణ్ణి వేడుకొంటారు కదా, అలాంటి వాళ్లను కూడా ఆయన క్షమిస్తాడా?’ అన్నది చాలామందికి కలిగే సాధారణ సందేహం. నిజానికి పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు. ‘ఒకసారి తప్పు చేసినా మనసారా పశ్చాత్తాప పడేవారిని భగవంతుడు తప్పక మన్నిస్తాడని’ భగవద్గీత చెబుతున్నది. ‘క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాన్తిం నిగచ్ఛతి/ కౌన్తేయ! ప్రతిజానీహి న మే భక్త: ప్రణశ్యతి (31-9). ‘భక్తితో పశ్చాత్తప్త హృదయంతో నన్ను ఆరాధించిన వారిని నేను తప్పక సన్మార్గంలోకి నడిపిస్తాను’ అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో పేర్కొన్నాడు. అయితే, ఆ పశ్చాత్తాపం తాత్కాలికం కాకూడదు. తప్పుల మీద తప్పులు చేస్తూ, ‘అయ్యో’ అనుకొంటుంటే లాభం ఉండదు మరి.


- సావధానశర్మ

536
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles