సేంద్రియ పద్ధతిలో బ్యూటీపార్లర్ విజయం!


Mon,October 21, 2019 12:46 AM

దాదాపు ఇరవైయేండ్ల నుంచి చర్మానికి, తల వెంట్రుకలకు ఆరోగ్యకరమైన ప్రాడక్ట్స్ అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నది. ఈ ఉత్పత్తులన్నీ సహజమైనవి. చర్మవ్యాధి నిపుణులు సైతం ఆమె ఉత్పత్తులను సిఫార్సు చేస్తున్నారు. ఈ ప్రాడక్ట్స్‌ను ఎలా తయారు చేస్తున్నారంటే..
bindhu
బెంగళూరుకు చెందిన బిందు మెహ్రోత్రాకు 19 ఏండ్లకే పెండ్లి అయింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఎ పట్టా పొందింది. అత్తమామలు రియల్ ఎస్టేట్ చేసేవారు. బిందు కూడా ఆ పనిలో భాగస్వామురాలైంది. పని అంతగా కలిసిరాకపోవడంతో, బొమ్మలు తయారు చేస్తుండేది. ఆ తర్వాత బ్యూటీపార్లర్ పెట్టాలనుకున్నది. బిందు చిన్నతంలో తల్లి తయారు చేసిన సున్నిపిండి, పెరుగు, గడ్డులోని తెల్లసొనతో ఫేస్‌ప్యాక్‌గా వేసుకొనేది. దాంతో చర్మం మృదువుగా కాంతివంతంగా ఉండేది. ఇప్పుడు మార్కెట్లలో రసాయనాలతో కూడిన క్రీములు, హెయిర్‌ఆయిల్ వాడడం వల్ల సమస్యలను ఎదుర్కొంటున్నారని భావించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని బిందు ఆరునెలలపాటు బ్యూటీకోర్స్ నేర్చుకున్నది. ఒకరి వద్ద పనిచేయడం ఇష్టం లేక సొంతంగా 1999లో జేపినగర్‌లో పార్లర్ మొదలుపెట్టింది. మూడేండ్ల తర్వాత జయానగర్‌కు మార్చింది. ప్రాడక్ట్స్‌ను తయారు చేసేందుకు పండ్ల తొక్కలను టెర్రస్ మీద ఎండబెట్టి వాటిని పల్వరైజింగ్ మెషిన్‌తో పొడిచేస్తుంది.


హెయిర్ ఆయిల్‌కు ఆమ్ల, నీమ్ పౌడర్, మెంతులను ఉపయోగిస్తున్నది. చర్మానికి అలోవెరా, బాదం సేంద్రియ పద్ధతిలో ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నది. బిందూస్ పేరుతో ప్రోడక్ట్స్‌ను ఆన్‌లైన్ ద్వారా విక్రయిస్తున్నది. ప్రోడక్ట్స్ ప్రాధాన్యం గురించి ప్రజలకు తెలిపింది. కస్టమర్లు పెరిగారు. వారి నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. రసాయనాలు కలుపకుండా ప్రోడక్ట్స్ తయారు చయడంతో ఎక్కువరోజులు నిల్వ ఉండవేమో అన్న సందేహం ఆమెను కలచివేసింది. దీనికోసం పీన్యాలోని పెస్ట్ కంట్రోల్ ఇండియా ఆటోక్లేవ్ యూనిట్‌కు వెళ్ళింది. ఆయుర్వేద మందులు కూడా ఈ పద్ధతిలో క్రిమిరహితం చేయబడుతున్నాయని, అది ఉత్పత్తిని ప్రభావితం చేయకుండా బ్యాక్టీరియాను మాత్రమే చంపుతుందని బిందుకు హామీ ఇచ్చారు. ఈ ప్రోడక్ట్స్ అన్నీ సహజమైనవి కాబట్టి చర్మవ్యాధి నిపుణులు కూడా సిఫార్సు చేస్తున్నారు.

1203
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles