వెల్లుల్లితో ఆరోగ్యసిరి


Mon,October 21, 2019 10:56 PM

garlic
కొంతమంది వెల్లుల్లిని వంటల్లో వాడడానికి ఇష్టపడరు. ఇంకొందరికి ఆ వాసనే పడదు. వెల్లుల్లి తినకపోవడం వల్ల అనేక పోషకాల్ని మిస్‌ అవుతున్నట్లే. వెల్లుల్లి వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలేంటంటే..


- అధిక బరువున్నవారు రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని ముక్కలుగా చేసి మెత్తగా పేస్ట్‌ చేసి దానిలో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజు ఉదయాన్నే పరిగడుపున తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా నెలరోజుల పాటు తీసుకోవడం వల్ల తొందరగా బరువు తగ్గుతారు.
- వెల్లుల్లి పేస్టును మొటిమలు, అలర్జీ ఉన్న చోట రాస్తే ఉపశమనం కలుగుతుంది. రక్తనాళాల్లోని మలినాలు తొలిగిపోతాయి. మోకాలి నొప్పులతో బాధపడేవారు వెల్లుల్లి రసాన్ని మోకాలిపై నొప్పి ఉన్న చోట రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
- వెల్లుల్లితో జలుబుకు ఉపశమనం కలుగుతుంది. ఆస్తమా, శ్వాస తీసుకోవడం వంటి ఊపిరితిత్తుల రుగ్మతలు తగ్గించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
- వెల్లుల్లి ఇన్సూలిన్‌ను పెంచుతుంది. మధుమేహగ్రస్తుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. పచ్చి వెల్లుల్లిలోని అల్లెసిన్‌ అనే కంటెంట్‌ మెటబాలిజం రేటును పెంచుతుంది. కొవ్వు త్వరగా కరగడానికి ఇది సహాయపడుతుంది.
- వారానికి 5 వెల్లుల్లి పాయలు పచ్చివి తినడం వల్ల క్యాన్సర్‌ వ్యాధిని 40 నుంచి 50 శాతం వరకు నిర్మూలించవచ్చు. కనుక దీన్ని సర్వరోగ నివారిణిగా చెప్పవచ్చు. ఇందులో విటమిన్‌ సి అధికంగా ఉండడం వల్ల నోటి వ్యాధులకు ఇది దివ్యౌషధం.

1136
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles