నృత్యంతో చైతన్యం


Tue,October 22, 2019 12:58 AM

Dance-theraphy
డ్యాన్స్‌ వినోదాన్ని అందించే కళ మాత్రమే కాదు. మనసుకు, శరీరానికి తగిలిన గాయాలను నృత్యంతో నయం చేయవచ్చని నిరూపిస్తున్నది ఓ కళాకారిణి. గృహహింస, లైంగిక వేధింపులకు గురైన మహిళలకు ఓదార్పునిస్తూ.. వారికి బాధనుంచి విముక్తి కల్పిస్తున్నది. ఇలా నృత్యాన్ని అస్త్రంగా చేసుకొని మహిళా లోకాన్ని ఆమె మేల్కొల్పుతున్నది.


పుణెకు చెందిన రినెల్లిస్నెలెక్జ్‌ అనే నృత్యకారిణి సామాజిక రుగ్మతలపై నృత్యాన్ని అస్త్రంగా చేసుకొని పోరాడుతున్నది. బాధితులకు భరోసా కల్పిస్తూ, వారిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. దురాచారాల వల్ల చేయని తప్పుకు బాలికలు, యువతులు అరణ్యరోదన అనుభవిస్తున్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు రినెల్లి ‘డ్యాన్స్‌ మూవ్‌మెంట్‌ థెరపీ’ (డీఎమ్‌టీ)ని ఉపయోగిస్తున్నది. నృత్యాన్నే ఔషధంలా ప్రయోగిస్తున్నది. దీని ద్వారా మహిళలను సామాజికంగా, శారీరకంగా, స్ఫూర్తినింపుతూ పరిపూర్ణమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతున్నది. ఓసారి రినెల్లి స్నేహితురాలు మానసిక సమస్యతో బాధపడుతుండగా ఆమెను ఓదార్చడానికి తన నృత్యాన్ని ప్రయోగించింది. కొద్దిరోజుల తర్వాత ఆమెలో మార్పు కనిపించింది. ఆ తర్వాత డీఎమ్‌టీతోనే ఎక్కువ మందికి మేలు చేయవచ్చని భావించింది. దీంతో జర్నలిస్టుగా పనిచేస్తున్న రినెల్లి ఉద్యోగానికి రాజీనామా చేసింది.

అప్పటినుంచి పూర్తి స్థాయిలో తన సేవలను అందించేందుకు సిద్ధమైంది. ‘జర్నలిస్టుగా కొంతమందికే మేలు చేయగలిగాను. నా నృత్యం ద్వారా ఎక్కువమందికి సాయం అందించగలుగుతున్నాను’అని రినెల్లిస్నెలెక్జ్‌ అంటున్నది. తన నృత్యం ద్వారా మానసిక సమస్యలను తొలగించే ప్రయత్నం చేస్తున్నది స్నెలెక్జ్‌. ‘కోల్‌కతా సంవేద్‌' అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి రినెల్లి బాధిత మహిళలకు సేవలందించేందుకు ముందుకు వచ్చింది. అప్పటి నుంచి సామాజిక రుగ్మతలకు గురైన మహిళలను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నది. ఇందుకోసం 20 మందితో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. వ్యక్తిగతంగా అవసరమైన కౌన్సెలింగ్‌ ఇస్తూ వారి సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను అందిస్తున్నది.

462
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles