స్మార్ట్‌ చొక్కా


Wed,October 30, 2019 12:57 AM

hexoskin
టెక్నాలజీ పెరిగాక రకరకాల పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు కూడా అనేక అప్లికేషన్లు వస్తున్నాయి. వాటితో పాటు స్మార్ట్‌ ఉత్పత్తులు కూడా వస్తున్నాయి. అలాంటి ఉత్పత్తుల్లో ఒకటే ‘స్మార్ట్‌ షర్ట్‌' ఊపిరితిత్తుల పనితీరును పర్యవేక్షించేందుకు దీన్ని శాస్త్రజ్ఞులు తయారు చేశారు. ఉచ్చ్వాస, నిశ్వాస సమయాల్లో ఛాతీ, ఉదరభాగంలో కలిగే మార్పులను అంచనా వేస్తుంది. ఏదైనా సమస్య ఉంటే వెంటనే మనల్ని అప్రమత్తం చేసేలా ఇది పనిచేస్తుంది. ఇది ఫోన్‌కు అనుసంధానం అయి ఉంటుంది. ‘హెక్సోస్కిన్‌'గా పిలిచే ఈ షర్టు ద్వారా గుండె పనితీరును కూడా ఎప్పటికప్పుడు అంచనా వేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నెదర్లాండ్స్‌కు చెందిన రెడ్‌బౌడ్‌ యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌ పరిశోధకులు దీన్ని తయారు చేశారు.

211
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles