చీమల భారీ దౌడు


Fri,November 8, 2019 01:02 AM

Jeeva-Shastram
ప్రపంచంలోనే అతివేగంగా దౌడు తీసే చీమలను సహారా ఎడారి ఇసుక దిబ్బలలో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటి వేగం పిల్లి వేగానికి సమానంగా ఉన్నట్టు వారు చెబుతున్నారు.


క్యాటగ్లిఫిస్ బాంబిసినా (Cataglyphis bombycina) గా పిలిచే సహారా తెల్ల చీమలు సెకనుకు తమ దేహం పొడువుకన్నా 108 రెట్లు అధిక దూరాన్ని ప్రయాణిస్తున్నట్లు జీవశాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. ఈ భారీ దౌడు ప్రఖ్యాత ఒలింపిక్ క్రీడాకారుడు యుసెయిన్ బోల్ట్ (Usain Bolt) వేగానికి 10 రెట్లు ఎక్కువని వారన్నారు. వీటిని ప్రపంచంలోనే అతి వేగవంతమైన చీమలుగా వారు నిర్ధారించారు. మన గృహాలలో పరుగులు పెట్టే పిల్లి వేగం గంటకు 120 మీటర్లు కాగా, ఈ చీమలు దీనికి సమాన వేగాన్ని ప్రదర్శిస్తున్నట్టు వారు కనుగొన్నారు. ఆహారాన్వేషణ కోసం ఇవి మండుటెండలో, వేడి ఇసుకలో తమ గూళ్లలోంచి బయటకు వచ్చి, ఆరు కాళ్లనూ గాలిలోనే కదులుస్తూ, ఒక్కోసారి మూడుకాళ్లపైనే భారీవేగంతో పరుగు తీస్తున్నట్టు శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. సుమారు 60 డిగ్రీల సెల్సియస్ (140 డిగ్రీల ఫారెన్‌హీట్స్) ఉష్ణోగ్రతలోనూ మనుగడ సాగించే ఈ చీమలను ఉత్తర ఆఫ్రికాలోని దక్షిణాది టునిసియా (Tunisia) దేశంలోని డౌజ్ (Douz) పట్టణ సమీపంలోని ఇసుక దిబ్బలలో గుర్తించారు.

244
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles