బధిరుల కోసం వినూత్న పరికరం


Fri,November 15, 2019 01:18 AM

ఇద్దరు విద్యార్థినులు బధిరులు ఎదుర్కొనే సమస్యను ప్రత్యక్షంగా చూసి చలించిపోయారు. వారికి సరైన పరిష్కారాన్ని అందించాలనుకున్నారు. ప్రాజెక్టు వర్కులో భాగంగా సరికొత్త సాంకేతికతతో వినూత్న పరికరాన్ని ప్రవేశపెట్టారు.
BLEE-DEVISE
పుణెకు చెందిన నుపురా కిర్లోస్కర్, జాహ్నవిజోషి అనే ఇద్దరు విద్యార్థినులు మహారాష్ట్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పుణె (ఎంఐటి)లో చదివారు. ఎంఐటిలో ప్రొడక్ట్ డిజైనింగ్‌లో శిక్షణ తీసుకున్నారు.ఈ సమయంలో ఓ కార్యక్రమంలో బధిరులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి తెలుసుకున్నారు. దీంతో వీరద్దరూ వారికి సరైన పరిష్కార మార్గాన్ని చూపాలనుకున్నారు. అందుకోసం ఆరునెలల పాటు అధ్యయనం చేశారు. ఎన్నో ప్రయోగాలు చేసి చివరకు చేతికి పెట్టుకునే వాచీ తరహాలో ఓ పరికరాన్ని రూపొందించారు. ఈ పరికరం సంగీత శబ్దాలను ప్రకంపనలుగా మారుస్తుంది. అందుకోసం ఆల్గరిథమ్‌ను రూపొందించారు. దీని ద్వారా బధిరులు సంగీతం వినవచ్చు. సంగీతంలోని లయను వేరు చేసి ప్రకంపనలతో కొత్త సంగీతాన్ని రూపొందించవచ్చు. ఈ పరికరాన్ని తయారు చేసి పుణెలోని రెడ్‌క్రాస్ సొసైటీలో ఉండే బధిరుల పాఠశాల విద్యార్థులకు అందించారు. ఈ పరికరం సత్ఫలితాలను ఇచ్చింది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఇండియా -యు ఎస్ స్టార్టప్ కనెక్ట్ అనే కార్యక్రమానికి జోషి,నుపురాలు హాజరయ్యారు. అక్కడ ప్రపంచదేశాల్లో ఉన్న బధిరులు ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సివస్తుందో తెలుసుకున్నారు.


ఈ పరికరాన్ని ఎక్కువమందికి అందించడానికి స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనుకున్నారు. అలా బ్లీటెక్ పేరుతో ఓ స్టార్టప్‌ను ప్రారంభించారు. వారు తయారుచేసిన పరికరానికి బ్లీ అని పేరు పెట్టారు. ముంబైలోని ఓ ఇంక్యుబేటర్ సంస్థ ద్వారా మార్కెట్‌లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. నుపురా, జోషిలు తయారు చేసిన బ్లీ పరికరం వేలాదిమంది బధిరులకు వరంగా మారింది. అనతి కాలంలోనే బ్లీ పరికరానికి ఆదరణ పెరిగింది. మొబైల్, బ్లూటూత్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఈ డివైస్ పనిచేస్తుంది. వాటి సాయం లేకుండా స్వతంత్రంగా పనిచేసేలా ప్రయోగం చేస్తున్నామని జోషి, నుపురలు చెబుతున్నారు. మా పరికరం బధిరులకు ఎంతో ఉపయోగపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నదని వారు అంటున్నారు.

168
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles