కృత్రిమపత్రంతో ఇంధన వాయువు


Thu,November 14, 2019 11:26 PM

Shakti-Shastram
మొక్కల్లోని కిరణజన్య సంయోగక్రియ స్ఫూర్తి తో శాస్త్రవేత్తలు ఒక కృత్రిమ పత్రాన్ని అభివృద్ధి పరిచారు. సౌరశక్తి ఆధారంగా కార్బన్‌ డై ఆక్సై డ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌, హైడ్రోజన్‌ల నుంచి ఇది కృత్రిమ ఇంధన వాయువు (Syngas) ను ఉత్పత్తి చేయగలదని వారంటున్నారు.


సిన్‌గ్యాస్‌ (సింథటిక్‌ గ్యాస్‌= కృత్రిమ వాయువు)ను నేరుగాకాక ఒక ఇంధన వనరుగా ఉపయోగించుకోగలమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతం శిలాజ ఇంధనాల నుండి ఉత్పత్తి చేయగలుగుతున్న ఈ వాయువును బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ పరిశోధకులు ఇటీవల ఆవిష్కరించిన కృత్రిమపత్రంతో నేరుగా ప్రకృతిసిద్ధంగా తయారుచేయగలగడం విశేషం. అదికూడా వాతావరణ కాలుష్య కారకాల (కార్బన్‌ డై ఆక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌) నుండి సౌరశక్తిని ఉపయోగించుకోవడం ద్వారా సృష్టించగలుగుతుందని వారన్నారు. దీని ఉపయోగంతో ఎలాంటి (అదనపు కార్బన్‌ డై ఆక్సైడ్‌) కాలుష్య ఉద్ఘారాలు విడుదల కావని, మబ్బు పట్టిన వేళకూడా ఇది చక్కగా ఇంధనవాయువును ఉత్పత్తి చేయగలదని వారు తెలిపారు. మొక్కల్లో ఎలాగైతే అణువులు సౌరకాంతిని గ్రహించి కిరణజన్య సంయోగక్రియకు దోహదపడతాయో అలాగే ఇందులోనూ సాంకేతిక విధానాన్ని వారు రూపొందించారు. కోబాల్ట్‌ (అయస్కాంతత్వ రసాయన మూలకం) జనిత ఉత్ప్రేరకాలతో కూడిన రెండు కాంతి గ్రాహకాలవల్ల ఇది సాధ్యమైనట్లు వారన్నారు.

96
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles