మెదడు త్రిమితీయ చిత్రం


Fri,November 15, 2019 01:27 AM

Shareera-Nirmana-Shastram
అత్యంత స్పష్టత, ఖచ్చితత్వంతో కూడిన మానవ పూర్తి మెదడు త్రిమితీయ చిత్రాలను శాస్త్రవేత్తలు సాధించారు. వీటిని చిత్రించగలిగిన ఒక పరికరాన్ని అమెరికాకు చెందిన ఎఫ్‌డీఏ (ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌) ఇటీవల ఆమోదించింది.


మూడేండ్ల కిందట ‘వైరల్‌ న్యుమోనియా’తో మరణించిన ఒక మహిళ (58 సం॥) సురక్షిత మెదడును 100 గంటల పాటు (సుమారు 5 రోజులు) ఎంఆర్‌ఐ స్కాన్‌ చేసి, ఇప్పటి వరకు చూడనటువంటి అత్యంత సున్నితమైన త్రిమితీయ చిత్రాలను శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. ఇందుకుగాను శక్తివంతమైన ‘7 టెస్లా’ ఎంఆర్‌ఐ యంత్రాన్ని వినియోగించారు. సుమారు 0.1 మిల్లీమీటర్‌ స్థాయి అతిచిన్న విస్తృత ప్రదేశాలను సైతం వీటిలో చూడగలుగుతున్నట్లు వారు చెప్పారు. ‘మనిషి మెదడును ఇంత క్లోజప్‌ (సమీపంగా)లో చూడడం ఇదే తొలిసారి’ అని వారన్నారు. అమెరికాలోని బోస్టన్‌ నగరానికి చెందిన ‘మసాచుసెట్స్‌ జనరల్‌ హాస్పటల్‌' పరిశోధకులు దీనిని సాధించారు. వీటితో సుదీర్ఘకాలంగా శాస్త్రవేత్తలను ఊరిస్తున్న ఈ అంతుబట్టని అవయవ (మెదడు) నిర్మాణాల్లోని పలు రహస్యాలు వెల్లడి కాగలవని వారు భావిస్తున్నారు. అయితే, ఈ రకమైన స్కానింగ్‌ ప్రయోగాన్ని జీవించి వున్నవారిపై చేయడం సాధ్యపడదని, కారణం అంత సమయం పాటు కదలకుండా ఉండడం అసాధ్యమని వారన్నారు. ప్రత్యేకించి ఉచ్ఛాస నిశ్వాసలు, రక్తప్రసరణతోనూ సంభవించే అత్యల్ప కదలికలు సైతం చిత్రాలలో అస్పష్టతలకు కారణమవుతాయని వారన్నారు.

204
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles