సూక్ష్మపోషకాలుగా విటమిన్లు


Fri,November 15, 2019 01:29 AM

Ahara-Shastram
మేలైన ఆరోగ్యానికి అత్యవసర ప్రాతను పోషించే సూక్ష్మపోషకాలలో విటమిన్లు ఒకటి. ఇవి చాలా చిన్నమొత్తంలో అవసరమవుతుంటాయి. మన శరీరం సొంతంగా తనకుగా తాను నేరుగా విటమిన్లను తనలో కలుపుకోలేదు. వీటికి ఏదో ఒక రకమైన ఆహార పదార్థం తోడుగా ఉండాల్సిందే. అందుకే, మనం తినే ఆహారంలో విటమిన్లు తప్పనసరి అని నిపుణులు చెప్తారు. ఇవి లేకపోతే వివిధ వ్యాధి కారకాలను ఆహార పదార్థంలోని స్థూల పోషకాలు ఒంటరిగా ఎదుర్కోలేవని వారు అంటారు. విటమిన్లు రెండు రకాలు. ఒకటి: కొవ్వు పదార్థాలతో కలిసిపోయేవి (fat-soluble vitamins), రెండు: నీటితో కలిసిపోయేవి (water-soluble vitamins). మొదటి రకం విటమిన్లలో ఏ, డీ, ఈ, కే ఉండగా, రెండో రకం విటమిన్లలో బి కాంప్లెక్స్‌ గ్రూప్‌, సీ ఉన్నాయి. ఈ రెండు రకాల విటమిన్లూ ఆయా ఆహార పదార్థాల (కొవ్వు లేదా నీరు) తోపాటుగా శరీరంలో కలిసిపోతాయి. ఇలా కరగగా, మిగిలిన విటమిన్ల పదార్థం కొవ్వుతో కూడినదైతే కాలేయంలో నిలువ వుండిపోగా, నీటితో కూడినవైతే మూత్రంతో కూడి విసర్జితమవుతాయి.

354
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles