
ఆస్ట్రేలియాకు చెందిన ‘టస్మేనియన్ డెవిల్'ది ప్రపంచంలోనే అతి బలమైన కాటుగా అధ్యయనంలో తేలింది. ‘లూనీ ట్యూన్స్' (అమెరికన్ యానిమేషన్) కామెడీ చిత్రంలో దీనిని ఓ సరదా కార్టూన్‌గా చిత్రించినా, నిజజీవితంలో మాత్రం భీకరజంతువుగా పరిశోధకులు అభివర్ణించారు. దీని బారిన పడితే ఇక అంతే. సగటున 20 పౌండ్ల (9.07 కిలోగ్రాములు) బరువు తూగే ఈ మాంసాహార జంతువు కాటు తీవ్రత 94 పౌండ్ల (42.6 కిలోగ్రాములు) ఒత్తిడిని కలిగి ఉంటుంది. ‘కాటు శక్తి సూచిక’ (Bite Force Quotient) లో దీనిది 181 కాగా, భయంకర హైనాకంటే ఇది రెట్టింపు కాగా, సింహం కంటే కూడా 60 పాయింట్లు ఎక్కువగా వారు చెబుతున్నారు.
రెండేండ్ల గర్భధారణ
మానవ గర్భధారణ కాలం తొమ్మిది నెలలు. కానీ, ఆఫ్రికా ఏనుగు గర్భధారణతో పోలిస్తే ఇది సగానికన్నా తక్కువ. ప్రపంచంలోనే అతి సుదీర్ఘకాలం గర్భధారణను కలిగి వుండే జంతువుగా ఆఫ్రికా ఏనుగును శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది సుమారు రెండేండ్లపాటు గర్భం దాలుస్తుంది.
