వంటింటి చిట్కాలు


Mon,November 18, 2019 12:24 AM

vantinti-chitkalu
-డైనింగ్‌ టేబుల్‌మీద స్టాండ్‌ లేకుండా వేడి పదార్థాలున్న గిన్నెలను పెట్టకూడదు. అలా పెట్టాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్లేట్‌ అడుగున మేట్స్‌ను ఉంచాలి.
-భోజనానికి ముందు టేబుల్‌ మీద దుమ్ములేకుండా మెత్తటి బట్టతో శుభ్రంగా తుడిచి ఆహార పదార్థాలను, ప్లేట్లు, గ్లాసులను అమర్చాలి.
-భోజనం తర్వాత వెంటనే టేబుల్‌మీద ఉన్న ప్లేట్లను, గిన్నెలను, గ్లాసులను తీసేసి టేబుల్‌ని శుభ్రం చేసేయాలి.
-కరంట్‌ పోయినప్పుడు కొవ్వొత్తిని వెలిగించి భోజనం చేస్తున్నప్పుడు ఆ కొవ్వొత్తిని స్టాండ్‌ లేకుండా టేబుల్‌ మీద పెట్టకూడదు.
-భోజనం అయ్యాక డైనింగ్‌ టేబుల్‌మీద గిన్నెలను ఉంచకూడదు. వాటిని వేరేచోట శుభ్రంగా పెట్టాలి.
-ఆ ప్రదేశంలో అందమైన ఫ్లవర్‌వాజ్‌ను ఉంచితే ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

162
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles