అత్యుత్తమ వ్యాపారవేత్తగా జయశ్రీ ఉల్లాల్


Fri,November 22, 2019 12:32 AM

ఫార్చ్యూన్ వెల్లడించిన బిజినెస్‌పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2019 జాబితాలో భారత సంతతికి చెందిన జయశ్రీ ఉల్లాల్‌కు స్థానం లభించింది. లండన్‌లో పుట్టిన ఆమె ఢిల్లీలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. అరిస్టా నెట్‌వర్కింగ్ పేరుతో క్లౌడ్ నెట్‌వర్కింగ్ కంపెనీని స్థాపించి అనతికాలంలోనే బిలియనీర్‌గా ఎదిగారు.
Jayshree-Ullal
జయశ్రీ ఉల్లాల్ శాన్‌ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ చదివారు. ఆ తర్వాత శాంతాక్లారా విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. అరిస్టా నెట్‌వర్కింగ్ నెట్‌వర్కింగ్ కంపెనీ ద్వారా భారతదేశంలోనేకాకుండా ప్రపంచదేశాల్లోనూ సేవలందిస్తున్నారు జయశ్రీ. అత్యుత్తమ లక్ష్యాలు సాధించి అసాధ్యమైన సవాళ్లను ఎదుర్కొని వినూత్న పరిష్కారాలు కనుగొన్న 20 మంది అత్యుత్తమ వ్యాపారవేత్తలను ఈ జాబితాకు ఎంపిక చేసింది ఫార్చ్యూన్. వాటాదార్లకు అందిన ప్రతిఫలాల నుంచి మూలధనంపై అందిన ప్రతిఫలాల వరకు మొత్తం 10 ఆర్థిక అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించారు.


ఇందులో ఉల్లాల్‌కు 18వ స్థానం దక్కింది. వ్యాపార రంగంలో ఉన్న మహిళలకు తప్పనిసరిగా కుటుంబసభ్యుల ప్రోత్సాహం అవసరం, నాకు మా కుటుంబ సభ్యులు పూర్తి సహకారం అందిస్తున్నారని, అందువల్లనే నేను ఇంతటి విజయాలను సాధించగలిగానని ఉల్లాల్ అంటున్నారు. సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువల విషయంలో తాను భారతీయురాలిగా ఎంతో నేర్చుకున్నానని జయశ్రీ చెబుతున్నారు. వ్యాపార పరంగా మాత్రమే తనను ప్రపంచ పౌరురాలిగా భావిస్తానని ఆమె పేర్కొన్నది. ఆసక్తి ఉన్న రంగంపై దృష్టి పెడితే మరిన్ని విజయాలు సాధించవచ్చు. ఈ మహిళలకే పురుషులకూ వర్తిస్తుందని ఆమె సూచిస్తున్నారు. ప్రపంచంలోని నెట్‌వర్క్ రంగంలో ఉన్న 50 మంది అత్యంత శక్తివంతుల జాబితా-2005లో ఉల్లాల్ చోటు దక్కించుకున్నారు. 1999లో సిలికాన్ ఇండియా ప్రకటించిన అవార్డుల్లో ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ లీడర్‌షిప్ అవార్డు పొందిన మొదటి మహిళగానేకాకుండా. 2015 సంవత్సరానికిగాను అమెరికా ఎంటర్‌ప్రీన్యూర్ అండ్ లీడర్‌షిప్ అవార్డుల జాబితాలో జయశ్రీకి చోటు దక్కింది. 2018-19 వరల్డ్ బెస్ట్ సీఈవోగా ఉల్లాల్ ఎంపికైంది.

180
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles