తల్లిపాలు మరింత శక్తిమంతం


Fri,November 22, 2019 12:33 AM

Aarogya-Shastram
శిశువుల ఆరోగ్యానికి ఆవుపాలకంటే తల్లిపాలు మరింత శక్తిమంతమైనవని ఒక కొత్త పరిశోధన వెల్లడించింది. ఇందులో హానికారక సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా, రోగనిరోధక శక్తిని పెంచే జీవాణువులు పుష్కలంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.


తల్లి పాలలోని ‘గ్లిసెరోల్‌ మోనోలారేట్‌' (glycerol monolaurate: GML) గా పిలిచే ఒక చిన్న అణువుపై తాజాగా జరిగిన అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాన్ని పరిశోధకులు కనుగొన్నారు. శిశువుల ఆరోగ్యానికి చెడు చేసే సూక్ష్మజీవులను హతమార్చేలా, రోగనిరోధకతను పెంచే గుణశక్తి (antimicrobial and antiinflammatory activities) ఆవుపాలకంటేకూడా తల్లిపాలలో అత్యధికంగా ఉన్నట్టు ఇందులో తేలింది. ఆవుపాలతోపాటు తత్సమాన సూత్రంతోకూడిన పాలలోనైనా ఈ శక్తి 150 మైక్రోగ్రామ్‌/ మి.లీ. ఉండగా, అదే తల్లిపాలలో మాత్రం 3,000 మైక్రోగ్రామ్‌/ మి.లీ. ఉన్నట్టు నిర్ధారణైంది. అమ్మపాలలో జీఎంఎల్‌ స్థాయిలు అత్యధికంగా ఉండడం వల్ల రోగకారక క్రిములను ఇందులోని పోషకాలు ఆవుపాలకన్నా అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొనగలవని వారు అంటున్నారు. ఈ విషయంలో మరింత లోతైన అధ్యయనాలు అవసరమని కూడా వారన్నారు.

126
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles